Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కర్ణాటక వెళ్లాల్సిందే


ఎన్టీఆర్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్లారు. ప్రస్తుతం ఆ సెలబ్రేషన్స్‌ని ముగించుకుని వారు హైదరాబాద్‌కి తిరిగి వచ్చేశారు కూడా. అంతకు ముందు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. వార్ 2లో ఎన్టీఆర్‌కి సంబంధించిన చిత్రీకరణ ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. 

Advertisement
CJ Advs

మరోపక్క ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఆగస్ట్‌లో అధికారికంగా మొదలైంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్-నీల్ రెగ్యులర్ షూట్‌కి వెళతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఎన్టీఆర్-నీల్ రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది అని తెలుస్తోంది. 

అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ లోనే ఏ స్పెషల్ సెట్టో వేసి మూవీ స్టార్ట్ చేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌కి చెందిన కర్ణాటక వెళ్లాల్సిందేనట. ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ కర్ణాటకలో మొదలు పెడతారనే వార్త చూడగానే నీల్ కోసం ఎన్టీఆర్ కర్ణాటక వెళ్లాల్సిందే అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

NTR to Start Prashanth Neel Film Shoot in Karnataka After New Year Break:

NTR Next with Prashanth Neel Set to Begin in Karnataka Post Sankranti
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs