మిస్టర్ బచ్చన్‌లో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నడుం పట్టుకుని లాగితే సోషల్ మీడియాలో దర్శకుడు హరీష్ శంకర్‌ను, హీరో రవితేజను ఎలా ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే. రవితేజ ఈ వయసులో తనకన్నా వయసులో చాలా చిన్నదైన అమ్మాయితో ఈ రకమైన డాన్స్ ఏమిటి అంటూ తెగ విమర్శించారు.
అలాగే అల్లు అర్జున్ పీలింగ్స్ సాంగ్‌లో రష్మికతో వేసిన స్టెప్స్‌ని కూడా విమర్శించేశారు. మరి ఇప్పడు బాలయ్య డాకు మహారాజ్ చిత్రంలో ఆయన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాతో చేసిన దబిడి దిబిడి సాంగ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.
థమన్ ఇచ్చిన మ్యూజిక్ పక్కనపెట్టండి, అసలు బాలయ్యతో ఆ స్టెప్స్ వేయించిన డాన్స్ మాస్టర్‌ని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య వయసేమిటి? ఆ స్టెప్స్ ఏమిటి? అంటూ ఏసుకుంటున్నారు. అంతేకాదు, రవితేజ హీరోయిన్‌ను పట్టుకుని లాగితే ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ లాగితే ఎంజాయ్ చేశారు. మరి బాలయ్య లాగితే? సైలంటయ్యారా? పట్టించుకోట్లేదా? లేదంటే అసలు ఆ పాటే ఎక్కట్లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.