ముందు నుంచి రామ్ చరణ్ గేమ్ చెంజర్ ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అంటే మూడు లాంగ్వేజెస్ లోనే విడుదల చేస్తున్నట్టుగా నిర్మాత దిల్ రాజు చెబుతూ రావడమే కాదు, శంకర్ కూడా ఈ మూడు లాంగ్వేజెస్ లోనే సినిమా రిలీజ్ కి రెడీ చేసేసారు. మరి ఈమధ్యన పాన్ ఇండియా అంటే మలయాళం, కన్నడ కూడా కలుస్తున్నాయి.
ఆ రెండు భాషల్లోనూ తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారు, తమిళ సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ హీరోలకు అక్కడి అభిమానులు తయారయ్యారు. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కర్ణాటకలో విడుదల లేకపోవడం, అక్కడ అదే లాంగ్వేజ్ లో సినిమాని రిలీజ్ చెయ్యకపోవడం, అసలు గేమ్ ఛేంజర్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో రామ్ చరణ్ కన్నడ అభిమానులు రెచ్చిపోయారు.
కర్ణాటకలో సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు అంటూ కొందరు సినిమా పోస్టర్లు పై కలర్ స్ప్రే చేస్తూ నిరసన తెలిపారు. మరి జనవరి పది న విడుదలకు సిద్దమైన గేమ్ ఛేంజర్ సినిమాకు రిలీజ్ కు ముందే నిరసన సెగ తగిలింది.