Advertisement
Google Ads BL

బాలీవుడ్ మేకర్స్ కు మెదడు లేదు - అనురాగ్


కొన్నాళ్లుగా బాలీవుడ్ పై సౌత్ సినిమాల దాడి చూసి అక్కడి ప్రముఖులు కక్కలేక మింగలేక ఉన్నారు. పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ నార్త్ పై సౌత్  పంజా విసరడం మాత్రం అక్కడి వాళ్లకు మింగుడు పడడం లేదు. తాజాగా సౌత్ సినిమాలు బాలీవుడ్ పై విజయాన్ని ఎందుకు సాధిస్తున్నాయో, ఈ విషయంలో బాలీవుడ్ మేకర్స్ కు మెదడు లేదు అంటూ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

సౌత్ వాళ్ళ సినిమాలను హిందీ యూట్యూబ్ ఛానల్స్ తక్కువ ధరలకు కొనుగోలు చేసి విడుదల చెయ్యడంతో నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలకి కనెక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. నార్త్ ఆడియన్స్ కి ఏమి ఇష్టమో అది బాలీవుడ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు. కానీ సౌత్ మేకర్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ సినిమాలు చేసి విజయాన్ని అందుకుంటున్నారు. 

హిందీ సినిమాలు చేస్తున్నామే కానీ, హిందీ ఆడియెన్స్ ను పట్టించుకోవడం లేదు అంటూ అనురాగ్ కశ్యప్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ కేవలం లాభాల గురించే ఆలోచిస్తుంది కానీ ఆడియన్స్ పల్స్ పట్టించుకోవడం లేదు, సినిమాలు ఎలా తీస్తే ప్రేక్షకులు ఇష్టపడతారని అలోచించడం లేదు, సినిమా మొదలు పెట్టగానే ఎలా మర్కెట్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. 

పుష్పా లాంటి మూవీ బాలీవుడ్ వాళ్ళు తియ్యలేరు, ఎందుకంటే వాళ్లకు మెదడు లేదు అంటూ అనురాగ్ కశ్యప్ సౌత్ vs నార్త్ అంటూ సాగుతున్న పోటీపై రియాక్ట్ అయ్యారు. 

Anurag Kashyap sensational comments on Bollywood:

Anurag Kashyap calls Bollywood BRAINLESS
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs