Advertisement
Google Ads BL

పుట్టపర్తిలో సాయి పల్లవి స్పెషల్ పూజలు


హీరోయిన్ సాయి పల్లవి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతుంది. చాలామంది హీరోయిన్ సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ రాగానే వెకేషన్స్ అంటూ విదేశాలకు చెక్కేసి సేద తీరుతారు. సాయి పల్లవి చాలా అరుదుగా వెకేషన్స్ అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కానీ ఏ చిన్న సమయం దొరికినా సాయి పల్లవి ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలుస్తుంది. 

Advertisement
CJ Advs

గత ఏడాది సాయి పల్లవి అమర్నాధ్ యాత్ర చేసింది. ఇక ఈ న్యూ ఇయర్ కి సాయి పల్లవి 2025 కి వెల్ కమ్ చెప్పేందుకు ఏ ఆస్ట్రేలియానో, లేదంటే లండనో వెళ్ళలేదు. ఆమె పుట్టపర్తి సాయి బాబా ఆశ్రమానికి వెళ్ళింది. కుటుంబంతో క‌లిసి పుట్ట‌ప‌ర్తికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

సాయి పల్లవి పుట్టపర్తిలో పట్టుచీరలో సంప్రదాయంగా.. బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకుంది. రీసెంట్ గా సాయి పల్లవి నటించిన అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా.. ఆమె నటించిన తండేల్ విడుదలకు సిద్దముతుంది. మరోపక్క బాలీవుడ్ రామాయణ లో సాయి పల్లవి సీత కేరెక్టర్ లో కనిపించబోతుంది. 

Sai Pallavi Visits Puttaparthi Sri Sathya Sai Baba:

Sai Pallavi Visuals at Puttaparthi Sai Baba Temple 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs