సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించే సినిమాల ఓపెనింగ్స్ కి అస్సలు హాజరవ్వరు. మహేష్ కి అదొక సెంటిమెంట్ కింద వస్తుంది. గతంలో ఎంత పెద్ద దర్శకుడితో సినిమా మొదలు పెట్టినా మహేష్ పూజా కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనలేదు, ఆయన వైఫ్ నమ్రత ఇంకా పిల్లలు సితార, గౌతమ్ హాజరయ్యి పూజలు నిర్వహించేవారు.
మరి ఈసారి మహేష్ ఆ సెంటిమెంట్ ని రాజమౌళి కోసం బ్రేక్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాజమౌళి తాను చేసే ఏ చిత్రం ఓపెనింగ్ అయినా తన హీరోలు లేనిదే మొదలు పెట్టారు. రేపు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో లో మహేష్-రాజమౌళి కాంబో మూవీ మొదలవ్వబోతుంది అనే ప్రచారం హుషారుగా జరుగుతుంది.
జనవరి 2 న మొదలు కాబోయే SSMB 29 పూజ కార్యక్రమాలకు మహేష్ హాజరవుతారా, ఒకవేళ మహేష్ రాజమౌళి తో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయన తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్టే. చూద్దాం ఏం జరగబోతుందో అనేది.