సంక్రాంతి కి విడుదలయ్యే సినిమాల్లో గేమ్ ఛేంజర్ జనవరి 10 న, డాకు మహారాజ్ జనవరి 12 న, సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 న విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో విడుదలవుతున్న మూడు చిత్రాలు క్రేజీ చిత్రాలే. వేటికవే విభిన్న కథలతో తెరకెక్కినవి.
అయితే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్స్ కన్నా ఎక్కువగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ క్రేజీగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. ఎక్కడ చూసినా సంక్రాంతి కి వస్తున్నాం దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లే కనబడుతున్నారు.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ దగ్గరనుంచి సాంగ్స్ లాంచ్ ఇలా ప్రతి చోటా సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తప్ప గేమ్ ఛేంజర్ టీమ్ కానీ, డాకు మహారాజ్ టీం కానీ కనిపించడమే లేదు. డాకు మహారాజ్ దర్శకనిర్మాతలు ఇంటర్వూస్ తో హడావిడి చేస్తున్నా అందులో బాలకృష్ణ కానీ, హీరోయిన్స్ కానీ కనిపించకపోవడం వెలితిగా కనిపిస్తుంది.
సంక్రాంతి కి వస్తున్నాం సాంగ్స్ ఒక్కొక్కటిగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ టీమ్ అమెరికా ఈవెంట్ తర్వాత హడావిడి లేదు, మళ్ళీ రేపు రాబోయే ట్రైలర్ లంచ్, రాజమండ్రి లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హడావిడి మొదలయ్యేలా ఉంది. కానీ ఈలోపే సంక్రాంతికి వస్తున్నాం టీమ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యేలా కనిపిస్తుంది.