2024 ఇలియానా కు చాలా స్పెషల్. సినిమా అవకాశాలు తగ్గాక పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్ పడిన ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ డోలాన్ ను సైలెంట్ గా వివాహం చేసుకుని, ఆ విషయం దాచిపెట్టి మరీ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టింది. బిడ్డ పుట్టాకే ఇలియానా మైకేల్ ని పరిచయం చేసింది
ఇక 2025 కి వెల్ కమ్ చెబుతూ ఇలియానా ఓ స్పెషల్ వీడియో ను షేర్ చేసింది. ఆ వీడియోలో తన కొడుకుతో ఇలియానా ప్రతి నెల ఎలా స్పెండ్ చేసింది.. జనవరి, ఫిబ్రవరి అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియో లోనే అక్టోబర్ లో ఇలియానా ప్రెగ్నెన్సీ కిట్ చూపించింది.
అంటే ఇలియానా అధికారికంగా రెండోసారి ప్రెగ్నెంట్ అని చెప్పకపోయినా ఆ వీడియో ద్వారా ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అని కన్ ఫర్మ్ చేసింది అంటున్నారు. సో 2025 లో ఇలియానా ఒడిలోకి మరో బేబీ రాబోతుందన్నమాట.