బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ని యూత్ ఎప్పటికి మరిచిపోదు. మరి బేబీ లో అలాంటి కేరెక్టర్ లో కనిపించి షాకిచ్చింది. ఆ చిత్రంలో క్యూట్ గా అందంగా, సింపుల్ గా ఆకట్టుకున్న ఈ బేబీ ఆతర్వాత నటించిన సినిమా నిరాశ పరచడంతో బయట కనిపించడం కాస్త తగ్గించింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే వైష్ణవి చైతన్య తాజాగా 2024 కి బై బై చెప్పేందుకు గ్లామర్ గా సిద్దమైంది.
ట్రెడిషనల్ గా ఉంటే లాభం లేదు అనుకుందేమో.. కాస్త గ్లామర్ లుక్ లోకి చేంజ్ అయ్యి మరీ సెల్ఫీ తో టాప్ లేపింది. మిర్రర్ లో తన ఐ ఫోన్ తో సెల్ఫీ దిగుతూ కనిపించిన వైష్ణవి చైతన్య న్యూ లుక్ మాత్రం అదిరిపోయింది.
లూజ్ హెయిర్ లో క్యూట్ గా కనిపించిన ఆమె చూపించాలనుకున్న గ్లామర్ మాత్రం కనిపించకుండా యూత్ ని డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి. గ్లామర్ డ్రెస్ లో ఉన్నప్పటికీ తన పూర్తి పిక్ మాత్రం షేర్ చెయ్యకుండా యూత్ ని ఊరించేసింది ఈ బేబీ.