పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ 2024 ఎన్నికల రిజల్ట్ సమయంలో మీడియాలో బాగా హైలెట్ అయ్యాడు. తండ్రి పవన్ తో కలిసి చంద్రబాబు, ప్రధాని మోడీలను కలవడంలో అకీరా పవన్ తో కలిసి సందడి చేసాడు. ఇక పవన్ ఫ్యాన్స్ అకీరా సినీ రంగ ప్రవేశంపై ఏంతో ఆతృతగా కనబడుతున్నారు.
అకీరా హీరోగా కన్నా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తల్లి దగ్గర పెరిగే అకీరా నందన్ తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశీలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. కాశీలో అకీరా సాంప్రదాయ లుక్ లో గంగానదిపై ఓ పడవలో కూర్చుని వెళుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈమధ్యనే మరణించిన తన తల్లి అస్తికలు గంగ లో కలిపేందుకు రేణు దేశాయ్ కుమార్తె ఆద్య, కొడుకు అకీరాతో కలిసి కాశీకి వెళ్లారు. అక్కడ పవిత్ర గంగానదిలో తల్లి అస్తికలు కలపడానికి ఆమె స్పెషల్ పూజలు నిర్వహించగా అకీరా అక్కడ గంగ నదిలో పడవ ప్రాణం చేస్తూ కనిపించాడు.
కొద్దిరోజులుగా అకీరా లుక్స్ విషయంలో పవన్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పడు కాశీలోని వీడియోలో అకీరా లుక్స్ పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.