కల్కి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మధ్యన ప్రభాస్ కాలికి దెబ్బతగలడంతో షూటింగ్ నుంచి చిన్నపాటి బ్రేక్ తీసుకున్న ప్రభాస్ తాజాగా కూల్ లుక్ లో దర్శనమిచ్చారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియో లో ప్రభాస్ లుక్స్ వైజ్ గా చాలా కూల్ గా కనిపించారు. లైఫ్‌లో మనకి బోలెడన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయ్. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మన కోసం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..
డ్రగ్స్‌కి నో చెప్పండి.. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కి బానిసలైతే ఈరోజే టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయండి.. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.. అంటూ ప్రభాస్ డ్రగ్స్ కి వ్యతిరేఖంగా చేసిన వీడియో వైరల్ అయ్యింది.