నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి చేసుకోబోయేది తెలుగు హీరోనే, కానీ అది ఎవరు అనేది మాత్రం చెప్పడం లేదు అంటూ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో వేదికపై చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. మరి ఎప్పటినుంచో రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే వార్త ఎంతగా వైరల్ అవుతున్నా వారు మాత్రం కన్ ఫర్మ్ చెయ్యడమే లేదు.
కానీ నిర్మాత నాగవంశీ మాత్రం ఇలా ఓ టాక్ షో లో రష్మిక బాయ్ ఫ్రెండ్ పేరు రివీల్ చెయ్యకుండా ఇండైరెక్ట్ గా తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటుంది అంటూ చేసిన కామెంట్స్ చూసి.. ఇంకెవరు ఆ తెలుగు హీరో విజయ్ దేవరకొండనే, రష్మిక డేటింగ్ లో ఉన్నది విజయ్ దేవరకొండతోనే కదా అంటూ మళ్ళీ గుసగుసలు మొదలు పెట్టేసారు..
అన్ స్టాపబుల్ టాక్ షోలో నాగవంశీ, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (డాకు మహారాజ్ టీమ్) బాలయ్య తో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.