తను నటిస్తున్న మూడు సినిమాల దర్శకనిర్మాతలకు కరెక్ట్ గానే డేట్స్ ఇచ్చాను, కానీ వారు వాడుకోలేకపోయారంటూ పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్స్ చూసి చాలామంది అవునా పవన్ రాజకీయాల వెంట పరిగెట్టి ఆ దర్శకనిర్మాతలను కన్ఫ్యూజ్ చేసింది నువ్వే, కానీ ఇప్పుడు ఏమిటి వాళ్ళే నేనిచ్చిన డేట్స్ వాడుకోలేదు అంటూ మట్లాడుతున్నావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ లను మొదలు పెట్టగా.. ఆ మూడు ప్రాజెక్ట్స్ కొంతమేర షూటింగ్ అవ్వగానే పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యి 2024 ఎన్నికల కోసం రెడీ అయ్యారు. ఆ తర్వాత గెలుపు, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వన్నీ గత ఏడాది కాలంగా పవన్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనివ్వకుండా చేసాయి.
మళ్లీ సెప్టెంబర్ నుంచి షూటింగ్ లకు హాజరవుతున్న పవన్ కళ్యాణ్ నిన్న సోమవారం సినిమా అప్ డేట్స్ ఇస్తూ.. నేను ఒప్పందం చేసుకున్న మూడు సినిమాలను టైం లోపు పూర్తి చెయ్యలేకపొయ్యారు, సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజి సినిమా కి నేనే కొంచం బాధ్యత తీసుకొని వర్క్ చెయ్యడం తో OG సినిమా పూర్తి అవ్వడానికి దగ్గరకొచ్చింది
నేను అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను, కానీ వారే సరిగా సద్వినియోగం చేసుకోలేదు, హరిహర వీరమల్లు ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.. అన్ని సినిమాలు ఒక్కొక్క దానిని వరసగా పూర్తి చేస్తాను అంటూ చెప్పడం చూసి మీరు పర్ఫెక్ట్ గా డేట్స్ ఇస్తే షూటింగ్స్ ఇంత ఆలస్యమవ్వదు కదా పవన్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.