మహానటి కీర్తి సురేష్ సమంతకు థాంక్స్ చెబుతుంది. కారణం తేరి లో సమంత పోషించిన రోల్ హిందీ రీమేక్ బేబీ జాన్ లో కీర్తి సురేష్ కి దొరికినందుకు కాదు, బేబీ జాన్ రీమేక్ అనగానే సమంత తన రోల్ లో కీర్తి సురేష్ బావుంటుంది అని సజెస్ట్ చేసినందుకు కీర్తి సురేష్ సమంత కు థాంక్స్ చెబుతుంది. అంత మంచి రోల్ కి తనని ప్రిఫర్ చేసిన సమంత కు కీర్తి సురేష్ స్పెషల్ గా థాంక్స్ చెప్పిందన్నమాట.
వరుణ్ ధావన్ హీరోగా, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ డిసెంబర్ 25 న విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం, పుష్ప ద రూల్ హడావిడి ముగియకపోవడంతో బేబీ జాన్ కి కలెక్షన్స్ బాగా తక్కువగా నమోదయ్యాయి. ఇక తేరి లో సమంత చేసిన కేరెక్టర్ అంటే చాలా ఇష్టం, బేబీ జాన్ కోసం సమంత నా పేరు చెప్పగానే కాస్త భయపడ్డాను.
కానీ సమంత చాలా సపోర్ట్ చేసారు, ఈ సినిమా అనౌన్స్ చేసి నా పేరు చెప్పగానే.. ఈ కేరెక్టర్ నువ్వు తప్ప వేరేవరూ న్యాయం చెయ్యలేరు అంటూ సమంత ఇన్స్టా స్టోరీ పెట్టారు. ఆ మెసేజ్ నాలో ఉత్సాహాన్ని నింపింది. అదే జోష్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. సమంత ఇచ్చిన భరోసాతోనే బేబీ జాన్ షూటింగ్ పూర్తి చేశాను అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.