పీకలేకపోయిన పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతానా? నా కొడుకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లనే వైసీపీకి, పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నాను అని వైసీపీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. వైసీపీని వీడుతున్నారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, ఇటీవలే కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించానని, 15 రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఉండటం వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, జనసేనలో చేరాల్సిన అవసరమేంటి? అని మీడియా వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రచారం, ఫేక్ వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.
అసలేం జరిగింది..?
2024 ఎన్నికల్లో తమ్మినేని ఓడిపోయాక నియోజకవర్గ బాధ్యతలు తన కుమారుడు చిరంజీవికి అప్పగించాలని అధిష్టానంను తమ్మినేని ఒకటికి రెండు సార్లు అడిగారు. ఐతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అంతే కాదు కనీసం తమ్మినేనికి కూడా ఇవ్వని అధినేత.. ఆఖరికి ముక్కూ మొహం తెలియని చింతాడ రవికుమార్ అనే నేతకు ఆముదాలవలస నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ పెద్దలకు, కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా సీతారాం పాల్గొనలేదు. అంతేకాదు పార్టీ మారాలనే ఆలోచన కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.
వద్దు డాడీ..!
ఉన్నన్నిరోజులుగా వైసీపీకి చేసిన సేవలు గుర్తించకపోవడం, ఎవరో కొత్త వ్యక్తిని తెచ్చి ఇంచార్జీగా నియమించడంతో తమ్మినేని, ఆయన కుమారుడు చిరంజీవి ఆవేదనకు లోనయ్యారు. ఇక వైసీపీ మనకొద్దు డాడీ.. మనకు గుర్తింపు, పదవులు ఉండే పార్టీలోకి వెళ్దామని నాన్నతో తెగేసి చెప్పారట కుమారుడు. ఈ క్రమంలోనే జనసేనతోనే తన జర్నీ అన్నట్లు ఫిక్స్ కూడా అయ్యారని అనుచరుల ద్వారా లీకులు వచ్చాయి. ఈ క్రమంలోనే సీనియర్లు ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదని పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. ఐతే తమ్మినేని మాత్రం కుమారుడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీనికి తోడు మాజీ మంత్రి బొత్స సత్యారాయణ.. తమ్మినేని, కుమారుడితో భేటీ అయ్యాక.. మాజీ స్పీకర్ నోట పార్టీ మార్పు విషయంపై క్లారిటీ రావడం గమనార్హం.