Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ పై చిరు ఫుల్ హ్యాపీ


రామ్ చరణ్-శంకర్ కలయికలో జనవరి 10 న రిలీజ్ కు సిద్దమవుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారా అంటే పుష్ప తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ అదే చెబుతున్నారు. తాను, మెగాస్టార్ చిరు కలిసి గేమ్ ఛేంజర్ చూశామంటూ ఆసక్తికర విషయం చెప్పడమే కాదు గేమ్ ఛేంజర్ కంటెంట్ పై చిరు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు అంటూ ఆయన చెప్పారు. 

Advertisement
CJ Advs

చిరంజీవి గారితో కలిసే గేమ్ చేంజర్ చూశాను. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్.. అంటూ గేమ్ ఛేంజర్ పై అంచనాలను పెంచేశారు. శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ గేమ్ చెంజర్ చూసి అంతే ఎంజాయ్ చేశాను..

రంగస్థలం తరువాత రామ్ చరణ్‌కు నేషనల్ జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు.. ఇప్పుడు గేమ్ చేంజర్‌ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది అంటూ సుకుమార్ చేసిన కామెంట్స్ ని మెగా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.  భార‌తీయుడు 2 లాంటి డిజాస్టర్ తర్వాత మెగా ఫ్యాన్స్ లో ఆందోళన కనిపించింది. కానీ ఇప్పుడు సుకుమార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ మాత్రం వారిని ఆనందంలో ముంచెత్తింది.

Chiranjeevi Garu Confident of a Mega Box Office Hit-Sukumar:

Chiranjeevi Reacts After Watching Game Changer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs