గత రెండు రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది, ఏ క్షణాన అయినా అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు.
కారణం.. మధ్యంతర బెయిల్ పై ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టీ తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చిన అర్జున్, ఆ వెంటనే మరోసారి అర్జున్ కు నోటీసులు ఇచ్చి ప్రత్యక్షంగా విచారించారు చిక్కడపల్లి పోలీసులు, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్ ఆలోచనపై పోలీసులు వెనక్కి తగ్గారు.
పోలీసులు దాఖలు చేసే కౌంటర్ లో పేర్కొనే అంశాల తీవ్రతను బట్టి ఈ రోజు ఇవ్వబోయే కోర్టు విచారణను బట్టి బెయిల్ పై నిర్ణయం ఆధారపడి ఉండే అవకాశం.. జనవరి 10 న విచారణను బట్టి రెగ్యులర్ బెయిల్ పై స్పష్టత ఉంటుంది.