నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ యాక్షన్ చిత్రం డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి స్పెషల్ గా బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న డాకు మహారాజ్ చిత్రంలో క్రేజీ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి విజిల్స్ వేయించే రేంజ్ లో ఉండబోతున్నాయనే వార్త నందమూరి అభిమానులకు కిక్ ఇస్తుంది.
తాజాగా నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ పై ఇస్తున్న హైప్ మాములుగా లేదు. డాకు మహారాజ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఒక 20 నిమిషాల ముందు అలా ఓ క్రేజీ ఎపిసోడ్ ఉంటుంది.. అది ఫ్యాన్స్ కే కాదు మాస్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కిక్ ఇస్తుంది. ఇదంతా ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది అంటున్నారు.
ప్రస్తుతం బాబీ, నిర్మాత నాగవంశీ క్రేజీగా డాకు ప్రమోషన్స్ మొదలు పెడితే.. బాలయ్య మాత్రం అఖండ 2 షూటింగ్ చేస్తూ, అలాగే అన్ స్టాపబుల్ టాక్ షో షూటింగ్ తో బిజీగా వున్నారు.