రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ జనవరి 10 న విడుదలవుతుంది. మూడేళ్లుగా సెట్స్ మీదున్నప్పటికీ గేమ్ ఛేంజర్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న టీమ్ రీసెంట్ గా అమెరికా ఈవెంట్లో పాల్గొని.. సినిమాపై క్రేజ్ పెంచారు.
ఇప్పటికే గేమ్ చెంజర్ మూవీపై దర్శకుడు సుకుమార్ హైప్ పెంచే కామెంట్స్ చేసారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అద్భుతమని, ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ సీన్స్ అదిరిపోతే.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్బ్ అనేలా ఉంటాయని సమాచారం. అంతేకాకుండా రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ చెన్నై, హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నా హైదరాబాద్ ఈవెంట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక్కడి తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇస్తుందో లేదో అనేది క్లారిటీ లేదు.