కొన్నాళ్లుగా జగన్ మోహన్ రెడ్డికి చెల్లెలు షర్మిలకు అస్సలు పడడం లేదు, నాలుగు గోడల మధ్యన పరిష్కరించుకోవాల్సిన ఆస్తి తగాదాలు రోడ్డెక్కడంతో వైఎస్ పరువు బజారున పడింది. జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే షర్మిలకు అన్యాయం చెయ్యడంతో ఆమె కాంగ్రెస్ తో చేరి రాజీయాలు మొదలుపెట్టింది.
రాజకీయాల్లోనూ అన్ననే టార్గెట్ చేస్తూ పదే పదే జగన్ పరువు తీస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో షర్మిలకు విజయమ్మ అండగా ఉండడం కొడుకు జగన్ తో అంటీముట్టనట్టుగా ఉండడం అనేది ప్రతిసారి హాట్ టాపిక్ అవుతూనే అది. షర్మిల కూడా తల్లి సపోర్ట్ తో అన్న జగన్ తో కయ్యానికి కాలు దువ్వింది.
అయితే క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ లో షర్మిల కేవలం భర్త పిల్లల్తో కనిపించగా విజయమ్మ మాత్రం బెంగుళూరు ప్యాలెస్ లో కొడుకు జగన్ ఫ్యామిలీ, అలాగే వైఎస్సార్ ఫ్యామిలీతో కలిసి కనిపించడమే కాదు, కొడుకు జగన్ తో కలిసి కేక్ కూడా కట్ చెయ్యడంతో విజయమ్మ జగన్ కు దగ్గరైంది, దానితో షర్మిల ఒంటరిదైంది అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
మరి క్రిస్టమస్ కొడుకుతో కలిసి చేసుకుని, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి విజయమ్మ ఏమైనా షర్మిల తో సెలెబ్రేట్ చేసుకుంటుందేమో చూడాలి.