యంగ్ టైగర్ పక్కన హీరోయిన్ గా అనుకుంటున్నారు అనగానే, అప్పటినుంచి కన్నడ భామ రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో కనిపించగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. కన్నడ నుంచి సప్త సాగరాలు దాటి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్ ను ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే డ్రాగన్(వర్కింగ్ టైటిల్) కోసం హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు.
ఆ క్షణం నుంచి రుక్మిణి వసంత్ ఫోటో కనబడితే చాలు లైక్ లు షేర్స్ అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఆ అమ్మాయిని ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా రుక్మిణి వసంత్ తన లేటెస్ట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రేడి గా కనిపించినా సింపుల్ గా ఉన్న రుక్మిణి లేటెస్ట్ లుక్ మాత్రం తెగ వైరల్ అయ్యింది.
ఎన్టీఆర్ హీరోయిన్ అంటే మాములు విషయం కాదు కదా.. అందుకే అలా. జనవరి నుంచి ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దుబాయ్ వెకేషన్స్ లో ఉన్నారు.