బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా-అర్జున్ కపూర్ ఒకప్పుడు జంటగా దర్శనమిచ్చేవారు. భర్తతో విడాకులయ్యాక అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసినా, లేదంటే అతనితో బ్రేకప్ అయినా మలైకా కపూర్ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. గతంలో సీక్రెట్ డేటింగ్ చేస్తూ వెకేషన్స్ కి వెళ్లిన మలైకా-అర్జున్ కపూర్ లు తర్వాత ఓపెన్ అవడం, జంటగా పబ్లిక్ లో తిరగడం వంటివి చేసారు.
ఈమధ్య కాలంలో అర్జున్ కపూర్-మలైకా అరోరా కలిసి కనిపించలేదు, దాంతో వీరికి బ్రేకప్ అయ్యిందినే వార్త వైరల్ అయ్యింది. అర్జున్ కపూర్ కూడా ఓ ఈవెంట్ లో నేను సింగిల్ అంటూ అనౌన్స్ చేసాడు. తాజాగా మలైకా కపూర్ అర్జున్ కపూర్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యింది. తనకి పర్సనల్ విషయాలు బయటపెట్టడం నచ్చదని చెప్పింది.
తానొక ప్రవేట్ పర్సన్ ని అని, తన పర్సనల్ విషయాలను నలుగురితో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు, నా లైఫ్ లో కొన్ని విషయాలను షేర్ చెయ్యకూడదు అనుకుంటాను, పర్సనల్ విషయాల కోసం పబ్లిక్ ప్లాట్ ఫామ్ ని వాడుకోవడం ఇష్టం ఉంటాడు. రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అర్జున్ ఏది చేప్పినా అది అతనిష్టం, తన వ్యక్తిగత అభిప్రాయం, దానిని నెగెటివ్ గా చూడాల్సిన అవసరం లేదు అంటూ సింపుల్ గా బ్రేకప్ విషయాన్ని కన్ ఫర్మ్ చేసింది మలైకా అరోరా.