మహానటి కీర్తి సురేష్ బేబీ జాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. బేబీ జాన్ నిన్న క్రిస్టమస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బేబీ జాన్ చిత్రం తమిళ తేరికి కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తేరి చిత్రాన్ని తెలుగులోనూ పోలీసోడు గా డబ్ చేసి వదిలారు. ఈ చిత్రం హిందీలో బేబీ జాన్ గా రీమేక్ అయ్యింది.
విజయ్-సమంత-అమీ జాక్సన్ తేరిలో నటించగా వరుణ్ ధావన్ హీరోగా, కీరి సురేష్, వామిక హీరోయిన్స్ గా బేబీ జాన్ తెరకెక్కింది. ఈ చిత్రంతో కీర్తి సురేష్ గ్లామర్ గా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంది. తేరి లో సమంత కేరెక్టర్ ని కీర్తి సురేష్ హిందీ బేబీ జాన్ లో పోషించింది. ఈ పాత్రలో ట్రెడిషనల్ గా కనిపించినా సాంగ్స్ లో కీర్తి సురేష్ అందాల ఆరబోత అవాక్కయ్యేలా చేసింది.
అయితే హిందీలో నిన్న విడుదలైన బేబీ జాన్ కి అంతంతమాత్రం రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడమే కాదు, కీర్తి సురేష్ పాత్ర కి పెద్దగా ప్రాధాన్యం లేదు, ఆ కేరెక్టర్ ని ముగించిన విధానం నార్త్ ఆడియన్స్ కి నచ్చలేదనే టాక్ ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి బేబీ జాన్ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ అందాల జాతర ఏమైనా ఆమెకు మరిన్ని క్రేజ్ హిందీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు కల్పిస్తుందేమో చూడాలి.
అలాగే బేబీ జాన్ ఓపెనింగ్స్ కి పుష్పరాజ్ అడ్డునిలిచాడు. హిందీలో పుష్ప రాజ్ విలయతాండవం చేస్తున్నాడు. క్రిస్టమస్ హాలిడే కూడా పుష్పరాజ్ తన ఖాతాలో వేసుకోసం బేబీ జాన్ కి బ్యాడ్ అయ్యింది. బేబీ జాన్ రిజల్ట్ చూస్తే కీర్తి సురేష్ కి అవకాశాలు రావడం కష్టమే అనిపిస్తుంది. పాపం ఆమె ఆశ బేబీ జాన్ తో తీరలేదనే చెప్పాలి.