మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ వైఫ్ సురేఖ, చరణ్ వైఫ్ ఉపాసన లు చాలా ప్రేమగా కనిపిస్తారు. అత్తమ్మ అంటూ ఉపాసన సురేఖతో క్లోజ్ గా ఉంటుంది. ఇక నాగబాబు ఫ్యామిలీలోకి వరుణ్ తేజ్ కి భార్యగా ఎంటర్ అయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అతగారు పద్మజతో చాలా ప్రేమగా కనిపిస్తుంది.
అత్తాకోడళ్లు కలిసి పచ్చళ్ళు పట్టడమే కాదు, ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించడం, ఫెస్టివల్స్ ను సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తున్నాము. ఇక నిన్న అత్తగారు పద్మజ బర్త్ డే కి ఆమె కోడలు లావణ్య త్రిపాఠి, అత్తగారితో కలిసి డాన్స్ చేస్తూ అంటే ఆడి పాడుతున్న పిక్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి-పద్మజల డాన్స్ పిక్ చూసి మెగా అత్తాకోడళ్ల ఆటా-పాటా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.