యంగ్ స్టార్ రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అది సినిమాల విషయంలో కాదండోయ్.. లుక్స్ విషయంలో రామ్ చరణ్ కి తన ఇంట్లోనే తన తండ్రి నుంచే పోటీ ఎదురయ్యింది. కొద్దిరోజులుగా మెగాస్టార్ యంగ్ లుక్స్ తో వదులుతున్న పిక్స్ చూసి మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
కానీ నెటిజెన్స్ ఏంటి చిరు నీ కొడుకు రామ్ చరణ్ కే పోటీ ఇస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ ఈమధ్యన స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ హ్యాండ్ సమ్ లుక్స్ తో నిజంగా అదరగొట్టేస్తున్నారు. రెండు వారాల క్రితమే చిరు వదిలిన యంగ్ లుక్స్ వైరల్ అవ్వగా నేడు మరోసారి తన హ్యాండ్ సమ్ లుక్ వదిలారు.
అది చూడగానే అందరూ రామ్ చరణ్ కి పోటీగా చిరు తయారవుతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిక్స్ సూపర్ స్టయిలిష్ గా చిరు వయసు 30 కి తగ్గిపోయిందా అనేలా ఉన్నారు. 60 ప్లస్ లోను మెగాస్టార్ ఈ రకమయిన ఫిట్ నెస్ ని మైంటైన్ చెయ్యడమే కాదు, అందుకు తగ్గ లుక్ ని హ్యాండిల్ చెయ్యడం మాములు విషయం కాదు.
అందుకే మెగాస్టార్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు అంతగా సెన్సేషన్ సృష్టిస్తుంది. ప్రస్తుతం విశ్వంభర ని రిలీజ్ కి రెడీ చేస్తున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత ఓదెల దర్శకత్వంలో చెయ్యబోతున్నారు. ఆ చిత్రం కోసమే మెగాస్టార్ తన లుక్ మారుస్తున్నట్టుగా టాక్.