సెలెబ్రిటీ జాతకాలతో ఫేమస్ అయ్యి.. ఈమధ్యన వాళ్ళ ఫ్యాన్స్ కి యాంటీ అయిన వేణు స్వామి గతంలో నాగార్జున కొడుకు కోడలు విడిపోతారంటూ వాళ్ళ జాతకాలు కలవలేదు అంటూ కామెంట్స్ చేసిన వేణు స్వామిపై జర్నలిస్ట్ సంఘాలు ధ్వజమెత్తాయి. ప్రభాస్ జాతకం బాలేదు, చైతు జాతకం బాలేదు అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడిన వేణుస్వామి మరోసారి సినిమా ఇండస్ట్రీపై పడ్డాడు.
సినిమా ఇండస్ట్రీ కి ఈ ఏడాది బాలేదు. అందుకే నాగార్జున వాళ్ళ ఇష్యు, అలాగే మంచు మోహన్ బాబు ఫ్యామిలిలో ప్రోబ్లెంస్, ఇప్పుడు అల్లు అర్జున్ ఇబ్బందులు అంటూ చెప్పుకొచ్చిన వేణు స్వామి తాజాగా అల్లు అర్జున్ జాతకం బాలుడు, జాతకాలను బట్టి అన్ని జరుగుతాయి.. అల్లు అర్జున్ జాతకంలో అలా ఉంది కాబట్టి జరిగింది.. మార్చ్ వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు.. దానికి ఎవ్వరూ కావాలని చెయ్యరు..
ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయి.. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే కళ్ళ లోంచి నీళ్ళు వచ్చాయి.. అతని కోసం రెండు లక్షలు ఇస్తున్నాను, శ్రీతేజ్ కోసం సొంత ఖర్చులతో యాగం చేస్తాను, కోలుకుంటాడు అని నమ్మకం ఉంది.. అంటూ వేణు స్వామి మరోసారి అల్లు అర్జున్ విషయంలో కామెంట్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.