బేబీ జాన్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్.. ఆ సినిమా విడుదల కాకుండానే అప్పుడే బాలీవుడ్ హీరోల కళ్ళల్లో పడినట్లుగా తెలుస్తోంది. పడదా మరి. బేబీ జాన్ చిత్రంలో కీర్తి సురేష్ ఎలాంటి లుక్ లో ఉన్నా.. ఆ చిత్ర ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ గ్లామర్ గురించి అందరూ మాట్లాడుకునేలా కనిపించి కవ్వించింది. బేబీ జాన్ చిత్రంలోనూ ఓ సాంగ్ లో వరుణ్ ధావన్ తో కలిసి కీర్తి సురేష్ అందాల ఆరబోతకు సౌత్ ప్రేక్షకులు షాకయ్యారు.
పెళ్లయ్యింది, అయినా వేంటనే బేబీ జాన్ ప్రమోషన్స్ లోకి దిగిపోయిన కీర్తి సురేష్ పరిధులు విధించుకోకుండా మెడలో తాళి తోనే గ్లామర్ షో చేస్తూ మోడ్రెన్ డ్రెస్సులతో మీడియా ముందు కీర్తి సురేష్ సందడి చేసింది. అందుకేనేమో బాలీవుడ్ హీరోలు చాలామంది వరుణ్ ధావన్ ని కీర్తి సురేష్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారట.
అదే విషయాన్ని వరుణ్ ధావన్ బేబీ జాన్ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. కీర్తిసురేష్ ని తమ సినిమాల్లో బుక్ చేసుకోవడానికి ఆమె నెంబర్ ని చాలామంది హీరోలు అడిగినట్లుగా వరుణ్ చెప్పుకొచ్చాడు. మరి సినిమా విడుదలకు ముందే కీర్తి సురేష్ గురించి బాలీవుడ్ ఎంక్వైరీ అంటే మాములు విషయం కాదు. చూద్దాం కీర్తి లక్ ఎలా ఉండబోతుందో అనేది.