Advertisement
Google Ads BL

సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల కీలక ప్రకటన


సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ 

Advertisement
CJ Advs

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఓవైపు న్యాయస్థానం పరిధిలో మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచినది వాళ్ళు ఇష్టానుసారం రాసేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి పుకార్లు, లేనిపోని అపోహలకు గురయ్యేలా రాసేస్తున్న పోస్టులకు చెక్ పెట్టాలని పోలీసులు నిర్ణయించారు. అందుకే సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.

చట్ట ప్రకారం చర్యలు..

వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ మొదలుకుని, నిన్నటి వరకూ బన్నీ అభిమానుల పేరిట.. ఇతర రాజకీయ పార్టీల అభిమానులు పేరుతో కొందరు పనిగట్టుకొని మరీ హడావుడి చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన కూడా చేసారు. ఐనా సరే ఆగకపోవడంతో పోలీసులే రంగప్రవేశం చేశారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఐనా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటన చేశారు.

ఎంతో నిబద్ధతతో..

ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రకటనలో తెలిపారు.

Police key statement on Sandhya Theater incident:

Allu Arjun stampede case highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs