ఈ క్రిస్టమస్ కి నితిన్, నాగ చైతన్యలు పోటీపడతారు అనుకుంటే ఆ ఇద్దరు హీరోలు ఈ క్రిస్టమస్ ని వదిలేసుకున్నారు. నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ చిత్రాలు డిసెంబర్ 20, 21 న పోటీ పడబోతున్నాయనే వార్త అప్పట్లో వైరల్ అయ్యింది. అప్పుడు గేమ్ ఛేంజర్ క్రిస్టమస్ కి అంటే ఈ ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గుతారని అన్నారు.
గేమ్ ఛేంజర్ సంక్రాంతి కి ఫిక్స్ చేసుకోగా రాబిన్ హుడ్ ని క్రిస్టమస్ స్పెషల్ గా దించుతానని అన్నాడు. కానీ సైలెంట్ గా క్రిష్టమస్ బరి నుంచి తప్పుకున్నాడు నితిన్. ఇక నాగ చైతన్య అయితే తండేల్ చిత్రాన్ని క్రిస్టమస్ కి రిలీజ్ చేయలేము, ఇంకా వర్క్ పూర్తి కాలేదు అంటూ ఫిబ్రవరి 7 కి వెళ్ళిపోయాడు. దాంతో ఈ హీరోలిద్దరూ క్రిష్టమస్ హాలిడేస్ ని వినియోగించుకోలేకపోయారు.
నాగ చైతన్య తండేల్ కి ఫిబ్రవరి 7 అంటే అప్పటికి స్టూడెంట్స్ లో ఎగ్జామ్ ఫీవర్ మొదలవుతుంది. ఇక పేరెంట్స్ పరిస్థితి చెప్పక్కర్లేదు. అదే క్రిస్టమస్ అయితే ఈ న్యూ ఇయర్ వరకు హాలిడే ఫీలింగ్ లో ఉండేవారు. ఇక నితిన్ రాబిన్ హుడ్ పరిస్థితి ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.
ఈవారం క్రిస్టమస్ స్పెషల్ గా మలయాళం నుంచి మోహన్ లాల్ బరోజ్, కన్నడ నుంచి మ్యాక్స్, తెలుగు నుంచి వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, హిందీ నుంచి బేబీ జాన్ చిత్రాలు విడుదలయ్యాయి.