బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి నిజంగా బ్రేకప్ అయ్యిందా? లేదంటే సింపతీ కోసం గేమ్ ఆడాడో అనే సందేహం చాలామందిలో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ముందు నుంచి లోన్లీ గా ఉండి, ఏదో కోల్పోయిన వాడిలా సోనియా, యష్మి ల దగ్గర కలరింగ్ ఇచ్చాడు, వాళ్ళను పడేసాడు. నిఖిల్ కి ఆయన ప్రేయసి కావ్యకి గొడవై విడిపోయారా అనే విషయంలో క్లారిటీ లేకపోయినా, నిఖిల్ హౌస్ లో ప్రవర్తించిన తీరుపై కావ్య కూడా అప్పుడప్పుడు నెగెటివ్ గా ఇండైరెక్ట్ గా పోస్ట్ లు పెట్టేది. .
ఇక నిఖిల్ బయటికి రాగానే కావ్యను కలుస్తాను అన్నప్పటికీ.. విన్నర్ అయ్యాక నిఖిల్ అసలు కావ్య పేరు ఎత్తలేదు. ఇక బిగ్ బాస్ విన్నర్ కి స్టార్ మా రెడ్ కార్పెట్ పరుస్తూ ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఆదివారం స్టార్ మా పరివార్ కి గెస్ట్ గా వచ్చిన నిఖిల్ ని అందరికి పరిచయం చేస్తాను అంటూ యాంకర్ శ్రీముఖి సీరియల్ బ్యాచ్ అంటూ వారిని పరిచయం చేస్తూ వెళ్ళింది.
అక్కడే కావ్య కూడా ఉంది. ఆమె కూడా ఈ ప్రోగ్రాంలో కనిపించింది. అయితే కావ్య నిఖిల్ పై చాలా కోపంగా కనిపించింది. శ్రీముఖి కూడా కావ్యను తప్పించి వేరే వాళ్ళందరిని పరిచయం చేస్తుంది, కావ్య మాత్రం నిఖిల్ వైపు చూడకుండా కోపంగా కనిపిస్తుంది. ఇదే ఈవెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అందులోను నిఖిల్ ని ఇష్టపడిన యష్మి కూడా ఉండడం గమనార్షం.
ఇక నిఖిల్ ని కళ్ళజోడు తియ్యమని శ్రీముఖి చెప్పినా తియ్యడు. మరి ప్రోమో వరకే కావ్య అలకా లేదంటే నిజంగా కావ్య నిఖిల్ పై కోపంగా ఉందా అనేది వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.