నేషనల్ క్రష్ అనే పదానికి పర్ఫెక్ట్ న్యాయం చేస్తుంది రష్మిక మందన్న. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. కన్నడ నుంచి హిందీ వరకు రష్మిక మందన్న గాలి వీస్తుంది. వరస అవకాశాలు, అందుకు తగ్గ విజయాలతో రష్మిక మందన్న దూసుకుపోతుంది. పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ సక్సెస్ లు నమోదు చేసింది.
హిందీలోనూ క్రేజీ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రష్మిక మందన్న యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ ఆమెను బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో నించోబెట్టింది. ఇప్పడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ లో నటిస్తుంది. ఇక సినిమాలే కాదు సోషల్ మీడియాలోనూ రశ్మిక మందన్న చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన రొటీన్ ని తెలియజేస్తూ స్పెషల్ ఫోటో షూట్స్ తో అద్దరగొట్టేస్తుంది. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం రష్మిక షేర్ చేసింది ఫొటోస్ చూసాక రష్మిక ఫ్యాషన్ ఐకాన్ అని పొగడకుండా ఉండలేరు. గ్లామర్ విషయంలో రష్మిక దగ్గర ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సిందే అన్న రీతిలో ఆమె ఫ్యాక్షన్ పోకడ కనిపిస్తుంది. మీరు కూడా శ్రీవల్లి కవర్ పేజీ ఫ్యాషన్ మంత్రాను చూసి తరించండి.