నిన్న సోమవారం ఎన్టీఆర్ అభిమాని తల్లి ఎన్టీఆర్ మోసగాడు, ఎన్టీఆర్ తమకెలాంటి సహాయంచేయలేదు, ఫోన్ లో అన్ని తాను చూసుకుంటాను అని చెప్పిన ఎన్టీఆర్ ఇప్పటివరకు తమ బిడ్డ కోసం ఒక్క రూపాయి సహాయం చెయ్యలేదు అంటూ ప్రెస్ మీట్ పెట్టడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ పేరు మీడియాలో మోగిపోయింది.
దేవర చిత్రం రిలీజ్ అపుడు క్యాన్సర్ పేషేంట్ అయిన తన అభిమానికి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ ఆ పేషేంట్ కి అయ్యే ఖర్చు తాను చూసుకుంటానకి మాటిచ్చి, మాట తప్పాడంటూ ఆ అభిమాని తల్లి ఆరోపించింది. అయితే ఎన్టీఆర్ ఆమెకి ఎలాంటి భరోసా ఇవ్వలేదు, ధైర్యంగా ఉండమని చెప్పారు అంతే. ఆయన అభిమానులు కొంత ఎమౌంట్ కలెక్ట్ చేసి ఆ ఎన్టీఆర్ అభిమానికి ఇచ్చారన్నారు.
అంతేకాదు టీటీడీ బోర్డు ఎన్టీఆర్ అభిమానికి 41 లక్షల హాస్పిటల్ బిల్ చెల్లించింది, అలాగే ఏపీ గవర్నమెంట్ 10 లక్షలు హాస్పిటల్ బిల్ కట్టింది.
అయినప్పటికీ మరో 10 లక్షలు కడితేనే కానీ చెన్నై అపోలో వైద్యులు పేషేంట్ ని డిశ్చార్జ్ చెయ్యరని ఎన్టీఆర్ అభిమాని తల్లి చెప్పింది. తాజాగా ఎన్టీఆర్ ఆ అభిమాని కోసం మిగతా హాస్పిటల్ బిల్ చెల్లించి అభిమానికి అండగా నిలిచారు. క్యాన్సర్ తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు..
అసలు విషయం తెలుసుకోకుండా నిన్నటి నుంచి సోషల్ మీడియా, కొన్ని చానల్స్ లో ఎన్టీఆర్ ని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు, అటు ఎన్టీఆర్ తన టీమ్ తో అభిమాని యోగక్షేమాలు తెలుసుకొని డిశ్చార్జ్ చేయించినట్లుగా తెలుస్తోంది.