పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫామ్ లోకి వచ్చేవరకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి నాలుగు స్తంభాల వలే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ మధ్యలో ఎప్పుడు పోటీ వాతావరణం కనిపించినా నలుగురు నాలుగు మూల స్తంభాల వలె టాలీవుడ్ ను ఏలారు. తాజాగా బాలయ్య ఈ నాలుగు స్తంభాలను గుర్తు చెయ్యడం హైలెట్ అయ్యింది.
ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో కి ఈ వారం విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు. మరి సమకాలికులు, తన తోటి నటులు స్టేజ్ పైకి వస్తే బాలయ్య ఎనర్జీ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా.. ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్టుగా వచ్చిన ప్రోమో వైరల్ గా మారింది. వెంకీ స్టేజ్ పైకి రాగానే..
మనం ఒకరికొకరం పోటీనా అని బాలయ్య ప్రశ్నించగా.. ఎక్కడమ్మా పోటీ అని వెంకటేష్ ఇచ్చిన ఆన్సర్ కి విజిల్స్ వెయ్యాల్సిందే. డాకు అని వెంకీ అనగా.. నువ్వే నా మనసులో మహరాజ్ అంటూ బాలయ్య ఆటపట్టించారు. ఆ తర్వాత చిరు, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లు ఉన్న ఫోటోను స్క్రీన్‌పై వేసి ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అని బాలయ్య చెప్పుకొచ్చారు. వీరిలో రాముడు మంచి బాలుడు ఎవరని బాలయ్య అడగ్గా.. కొంపతీసి నువ్వు రాముడివా అని వెంకటేష్ ఆటపట్టించారు.
ఎవరినైనా హత్తుకుంటే ఎలా ఉన్నా చైతూని హత్తుకుంటే అదేదో ఎమోషన్ అంటూ నాగచైతన్యతో బాండింగ్ గురించి చెబుతూ వెంకీ ఎమోషనల్ అయ్యారు. వెంకీ ఈ వేదికపై తన కూతుళ్ల గురించి పరిచయం చేశాఋ. ఆ వెంటనే వెంకటేష్ సోదరుడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును .. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడిలను ఆహ్వానించారు బాలయ్య. ప్రస్తుతం వెంకీ-బాలయ్య ల అన్ స్టాపబుల్ ప్రోమో మాత్రం తెగ వైరల్ అయ్యింది.