సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో గత వారం అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీదున్న హీరో అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ తన న్యాయవాది తో పాటుగా తండ్రి అల్లు అరవింద్, మామగారు చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాస్ తో కలిసి పోలీసువిచారణకు చిక్కడపల్లి వచ్చారు.
రెండు గంటల పాటు సాగిన విచారణ అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్ కి విచారణ అధికారులు తెలిపారు. అంతేకాదు తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు.
అల్లు అర్జున్ కూడా తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపినట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, బన్నీ వాస్ లతో కలిస్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.