ఇప్పటివరకు స్టార్ మా లోనే కన్నడ vs తెలుగు వార్ కనిపించింది. ఇప్పుడు అది ఈటీవిలోను మొదలయ్యింది. కన్నడ యాక్టర్స్ ని సీరియల్స్ కు తీసుకొచ్చి వారికి అధిక పారితోషికాలు ఇవ్వడమే కాదు, తెలుగు వారికి అవాకాశాలు ఇవ్వడం లేదు అనే ఆరోపణల నడుమ నిన్నగాక మొన్న బిగ్ బాస్ 8 విన్నర్ గా కన్నడ స్టార్ నిఖిల్ నిలవడంపై చాలా విమర్శలొచ్చాయి.
తెలుగోడైన గౌతమ్ కి అన్యాయం చేసి కన్నడ వాళ్లకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటూ చాలామంది బహిరంగంగానే మాట్లాడుకున్నారు. ఇప్పుడు అదే కన్నడ vs తెలుగు గొడవ ఈటీవీలో మొదలయ్యింది. ఈటీవీలో డిసెంబర్ 31 నైట్ పార్టీ పేరు తో రాబోయే కార్యక్రమంలో యాంకర్ సౌమ్య రాయ్ నా మాతృ భాష కన్నడ, నేను అక్కడినుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మట్లాడడం చాలా గొప్ప విషయమని చెప్పింది.
మీరు మాట్లాడే పది మాటల్లో 8 బూతులు ఉంటున్నాయి అంటూ కమెడియన్ నూకరాజు వెటకారంగా మాట్లాడాడు. మీరు కన్నడకి వచ్చి కన్నడ నేర్చుకుని మట్లాడండి అంది సౌమ్య రాయ్, దానికి నూకరాజు నాకు రానప్పుడు నేను కన్నడకి వెళ్ళను మేడం అన్నాడు. అలాంటప్పుడు అన్ను షోకి పిలవకండి, మీ తెలుగు వాళ్ళనే పిలుచుకోండి అంది సౌమ్య.
దానితో హైపర్ ఆది కూడా ఈ గొడవ మధ్యలోకి వచ్చాడు. ఎవ్వరైనా ఛాలెంజ్ అబ్బా నేను ఈటీవిని వదిలేసి వెళ్ళిపోతాను అన్న ప్రోమో వైరల్ అయ్యింది. మరి ఇది నిజమైన గొడవా లేదంటే ఫ్రాంక్ అనేది పూర్తి ఈవెంట్ చూస్తే కానీ తెలియదు.