నేడు మంగళవారం ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీస్ విచారణకు రావాల్సిందిగా చిక్కడపల్లి పోలీసులు గత రాత్రి నోటీసులు అందించడమే తడువుగా.. అల్లు అర్జున్ తన ఇంటికి లీగల్ టీమ్ ని పిలిపించుకుని వారితో చర్చలు జరిపారు. ఈరోజు విచారణలో ఎదుర్కోబోయే ప్రశ్నలకు సమాధానాలు తన లీగల్ టీమ్ ద్వారా చర్చించిన అల్లు అర్జున్ నేడు 11గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.
అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చెయ్యనున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన లాయర్ కూడా ఉన్నారు. A 11 గా ఉన్న అల్లు అర్జున్ కి 20 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ విచారణ రెండు గంటలలో పూర్తికావొచ్చని సమాచారం. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అల్లు అభిమానులు కోకోల్లలుగా చేరుకున్నారు.