డిసెంబర్ 12 న చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనీతో కుటుంబ సభ్యులు, కొద్దిమంది ప్రముఖుల నడుమ మూడు ముళ్ళు వేయించుకుని హిందూ సాంప్రదాయంలో గోవా వేదికగా ఏడడుగులు నడిచిన కీర్తి సురేష్, తర్వాత రెండు రోజులకి గోవాలోని పురాతన చర్చ్ లో ఆంటోనీని క్రిష్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకుంది.
అయితే పెళ్లి, రిసెప్షన్ అంటూ కీర్తి సురేష్ తీరిగ్గా కాలయాపన చెయ్యలేదు, కనీసం పెళ్లి తర్వాత హనీమూన్ కూడా వెళ్ళలేదు. పెళ్లయ్యింది, తర్వాత జరగాల్సిన చిన్న చిన్న ముచ్చట్లను జరిపేసి బేబీ జాన్ ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యింది. గ్లామర్ గా మెడలో తాళిబొట్టు తో కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో కలిసి మీడియా ముందు హడావిడి చేసింది.
బేబీ జాన్ రేపు డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో గత రాత్రితో ప్రమోషన్స్ కి గుడ్ బై చెప్పేసిన కీర్తి సురేష్ ఇకపైన భర్త అంటోనీతో కలిసి హనీమూన్ కి చెక్కేస్తుందో, లేదంటే బేబీ జాన్ రిజల్ట్ చూసాక భర్త తో కలిసి హనీమూన్ అంటూందో చూడాలి అంటూ ఆమె అభిమానులు తెగ మాట్లాడేసుకుంటున్నారు.