టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం పిల్లనిచ్చిన మామ, కాంగ్రెస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా ఘోర అవమానం జరిగిందని వార్తలు గుప్పుమంటున్నాయి. సోమవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కలవడానికి గాంధీభవన్‌కు వచ్చారు. గత కొన్నిరోజులుగా నడుస్తున్న బన్నీ వివాదాన్ని నేరుగా హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి, ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఐతే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మాట్లాడటం కాదు కదా కనీసం లోపలికి ఎంట్రీ ఇవ్వలేకపోయారు కంచర్ల.
మాట్లాడనుపో..!
కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, కూర్చోబెట్టి సమస్య ఏంటో తెలుసుకోకపోవడంతో తీవ్ర అవమానంగా భావిస్తున్నారు ఆయన అనుచరులు, కార్యకర్తలు. అల్లు అర్జున్ మమతో మాట్లాడకుండానే దీపాదాస్ మున్షీ పంపడం విమర్శలకు తావిస్తోంది. దీంతో గాంధీభవన్ నుంచి కోపంగా చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో హెడ్ లైన్ అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ మొదలుకుని ప్రతి విషయంలోనూ హై కమాండ్ సపోర్టుతో ఏదో ఒకటి చేయాలని ఆయన చాలా తాపత్రయ పడుతున్నారు. ఐతే ఒక్క ప్రయత్నమూ వర్కవుట్ కాలేదు.
అబ్బే అదేం లేదే!
ఐతే ఈ విషయం మీడియాలో రావడంతో దీన్ని కవర్ చేయడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకడు. మమ్మల్ని కలవడానికి వచ్చినట్టు మాకు ముందుగా సమాచారం లేదు. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళని చూసి పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అంటూ అతను వెళ్ళిపోయారు. వెళ్లిన వెంటనే నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అల్లు అర్జున్ మీద మేమెందుకు కక్ష చూపిస్తాము? అని మీడియాను రివర్స్ ప్రశ్నించారు.