ఈమధ్యన హీరోల అభిమానులు చాలా సెన్సిటివ్ గా తయారయ్యారు. తమ హీరో మీద ఏదైనా కామెంట్ పడితే దానికి తగ్గ సమాధానం కాదు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. అలాంటి అభిమానులను అందులోను మెగా ఫ్యాన్స్ ని ఓ నిర్మాత కెలకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఆయనే కుర్ర ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన డాకు మహారాజ్ మూవీ సాంగ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో మెగా అభిమానులను నాగవంశీ ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టారు. దర్శకుడు బాబీ గురించి, డాకు మహారాజ్ గురించి హైప్ క్రియేట్ చేసే ఉద్దేశ్యంలో నాగవంశీ మట్లాడుతూ.. చిరు ఫ్యాన్స్ తిట్టుకోకండి, దర్శకుడు బాబీ చిరంజీవి గారి(వాల్తేర్ వీరయ్య) సినిమా కన్నా బాలయ్య మూవీని బాగా తీశారు.
డాకు మహారాజ్ ఇంటర్వెల్ లోనే సినిమా సూపర్ అంటూ నాకు మీరు ఫోన్ చేస్తారు, బాలకృష్ణ గారిని గత 20-30 ఏళ్లలో ఇలాంటి విజువల్స్ తో మీరు చూసుండరు. బ్యూటిఫుల్ గా ఎమోషన్స్ ఉంటాయి, అందుకు తగ్గ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ మీరు కోరుకునేది కన్నా ఎక్కువగా ఉంటుంది అంటూ నాగవంశీ బాలయ్య సినిమాని పొగిడే క్రమంలో మెగా ఫ్యాన్స్ ను హార్ట్ చేసారు.
వాల్తేర్ వీరయ్య దర్శకుడు బాబీ, ఆ చిత్రం సూపర్ హిట్. దానికన్నా డాకు మహారాజ్ సూపర్ గా ఉంటుంది అని చెప్పే క్రమంలో నాగవంశీ చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు కోపం తెప్పించాయంటున్నారు విశ్లేషకులు.