సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అనగానే వరసగా స్టార్ హీరోల అవకాశాలతో దూసుకుపోతున్న త్రిష కృష్ణన్ పేరునే చెబుతారు. 96 మూవీతోనే త్రిష కెరీర్ లో బిజీ అవుతుంది అనుకుంటే ఆ తర్వాత ఆమె నటించిన ప్రతి సినిమా ఆమె అభిమానులను నిరాశ పరిచాయి.
కానీ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మాత్రం త్రిష కు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఆ సినిమా రిజల్ట్ తో పని లేకుండా త్రిషకి అవకాశాలు వచ్చి పడ్డాయి. ఒకటా రెండా వరసగా క్రేజీ స్టార్ హీరోలతో త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంత బిజీగా మారిన హీరోయిన్ బహుశా త్రిష నే కావొచ్చేమో.
తాజాగా త్రిష వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబందించిన పిక్ షేర్ చేస్తూ.. నేను ప్రేమలో పడినా లేదా నా హృదయాన్ని విడిచిపెట్టిన నగరానికి లేదా దేశానికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు♥️ నా ఆత్మ ఎప్పుడూ ఒకే చోట ఉండకూడదని అనుకోండి.
There’s never been a city or a country that I’ve been to that I haven’t fallen a lil bit in love with or left a lil bit of my heart at♥️ Guess my soul wasn’t ever meant to be in one place🪽 అంటూ దానికి స్టోరీని జత చేసింది.