రామ్ చరణ్ ఇప్పుడు రెండు రకాల టెన్షన్స్ ను క్యారీ చెయ్యాల్సి వస్తుంది. గేమ్ ఛేంజర్ తో జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రామ్ చరణ్ ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ అవడంతో రామ్ చరణ్ RC 16 షూటింగ్ కి బ్రేకిచ్చారు. ప్రస్తుతం చరణ్ అమెరికాలో ఉన్నారు, ఆయన ఇండియాకి తిరిగి రాగానే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది.
అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో రెండు టెన్షన్స్ తీసుకుంటున్నారనేది అందరూ మాట్లాడుకుంటున్న మాట. అందులో ఒకటి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చెయ్యాలి, ఇప్పటికే ఎన్టీఆర్ దేవర తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసేసి హ్యాపీగా ఉంటే.. ఇప్పడు రామ్ చరణ్ వంతు. అది గేమ్ ఛేంజర్ తో బ్రేక్ చెయ్యాలి, అదో టెన్షన్.
మరొకటి ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పుష్ప ద రూల్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తేవడమే కాదు.. రికార్డ్ స్థాయిలో1500 కోట్ల మార్కెట్ ని సెట్ చేసి పెట్టాడు, మరి రామ్ చరణ్ కూడా అటు ఇటుగా ఆ 1500 మార్క్ ని టచ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు సిసలు టెన్షన్ రామ్ చరణ్ కి అదే. గేమ్ ఛేంజర్ తో గట్టిగా కొట్టాల్సిన భారం చరణ్ పై పడింది.
మరొకటి ఇండియన్ 2 డిజాస్టర్ అవడం గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమే అయినా.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ కట్ అదిరిపోయే రేంజ్ లో ఉంటే ఆ టెన్షన్ పక్కనపెట్టొచ్చు, ఆ ట్రైలర్ సినిమాపై పెంచే హైప్ ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుంది.
మరి రామ్ చరణ్ ఆ రెండు టెన్షన్స్ ని దాటి విజయకేతనం ఎగురవేస్తాడా లేదా అనేది మెగా ఫ్యాన్స్ లో మొదలై టెన్షన్.. ఇప్పుడు ఇదే నెటిజెన్స్ మాట్లాడుకుంటున్న ముచ్చట.