రీసెంట్ గా అమరన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. గార్గి సినిమాలో అద్భుతమైన నటనగానూ సాయి పల్లవి ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకుంది. నేచురల్ బ్యూటీ ఎంచుకునే కథలే ఆమెని విజయ తీరానికి చేరుస్తున్నాయి. సాయి పల్లవి ఏ ప్రాజెక్ట్ కైనా సైన్ చేసింది అంటే ఆ సినిమా హిట్ అని అందరూ ఫిక్స్ అయ్యేలా ఉంటాయి ఆమె సెలెక్ట్ చేసుకునే కథలు.
ప్రస్తుతం తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణ చిత్రంలో సీత కేరెక్టర్ లో నటిస్తుంది. దానితో ఆమె క్రేజ్ మరింతగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి చెల్లెలితో సాయి పల్లవి వెకేషన్స్ లో బిజీగా కాదు బాగా ఎంజాయ్ చేస్తుంది. చెల్లి మాత్రమే కాదు ఫ్రెండ్స్ తోనూ సాయి పల్లవి ఈ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.
తన చెల్లి, ఫ్రెండ్స్ తో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్‌కు వెళ్లింది. ఆ వెకేషన్స్ ఫొటోస్ షేర్ చేస్తూ.. స్పెషల్ ట్రిప్. మనోహరమైన వ్యక్తులు, అడ్వెంచర్, లాఫ్టర్ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ వెకేషన్ లో సాయి పల్లవి స్లీవ్‌లెస్ డ్రెస్ తో బీచ్ లో కలియతిరుగుతూ.. వాటర్ లో ఆడుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.