ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు బొగ్గు బ్యాక్డ్రాప్ లోనే అంటే హీరోలను పక్కా మాస్ గా చూపించే కథలతో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్-నీల్ ఫస్ట్ లుక్ లోను ఎన్టీఆర్ పక్కా మాస్ గానే కనిపించడంతో అది కూడా ఓ కెజిఎఫ్, ఓ సలార్ స్టయిల్లోనే ఉండబోతుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. తనకిష్టమైన హీరోల్లో ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారని నీల్ ఓ సందర్భంలో చెప్పారు.
అలాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ ఎలా ఉండబోతుంది, దాని బ్యాక్డ్రాప్ ఏమిటి అంటూ అందరూ తెగ ముచ్చటించేసుకుంటున్నారు. సలార్ వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మూవీపై ప్రశాంత్ నీల్ ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసారు. గతంలో తాను చేయాలనుకున్న మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ లోనే ఎన్టీఆర్ మూవీ ఉంటుందని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
కెజిఫ్, సలార్ లను మించి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ తో మూవీని చేయబోతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రం లో ప్రశాంత్ నీల్ ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చెయ్యకపోయినా.. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ నటించే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ వార్ 2 కి సంబందించిన బిగ్ షెడ్యూల్ ముగించి క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ఫ్యామిలీతో సహా వెకేషన్ కి వెళ్లబోతున్నాడు. ఆతర్వాత నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.