తాను పుష్ప 2 ని సంధ్య థియేటర్ లో చూసేందుకు వెళ్ళినప్పుడు అక్కడ నాకు పోలీసులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అభిమానులకు అభివాదం చేసి సినిమా చూసేందుకు నేను థియేటర్ లోకి వెళ్ళాను. నాకు మహిళ మృతి చెందిన విషయం కానీ, శ్రీతేజ్ పరిస్థితి సీరియస్ అయిన విషయం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు, కానీ బయట జరిగిన తొక్కిసలాట గురించి నా టీమ్ నాకు చెప్పగానే నేను సినిమా పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి వెళ్ళిపోయాను అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభిమానులే కాదు, చాలామంది నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్ వరకు అంటే పుష్ప 2 సినిమా రెండు గంటల పాటు వీక్షించాడు, అతను పుష్ప 2కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చేతులు ఊపి ఎంజాయ్ చేసిన వీడియోస్, అలాగే అతను వెళుతూ వెళుతూ కారు ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిన వీడియోస్ షేర్ చేస్తూ దీనికి నీ సమాధానం ఏమిటి అల్లు అర్జున్ అనే కామెంట్స్ పడుతున్నాయి.
అంతేకాదు సోషల్ మీడియాలోనే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట, మహిళ మృతి, పిల్లాడి పరిస్థితి విషమం అనే వార్తలు అంతలా స్ప్రెడ్ అయితే నీ పక్కన ఉన్నవాళ్లు నెక్స్ట్ డే వరకు నీకు చెప్పకపోవడం నిజంగా హాస్యాస్పదం, ఒకవేళ మరుసటిరోజు ఉదయం ఆ వార్త తెలిసినా అదే రోజు సాయంత్రం క్రాకర్స్ కాల్చుతూ కనిపించడం ఏమిటి అనే విమర్శలతో అల్లు అర్జున్ కవరింగ్ పై, అదేనండి సదరు ప్రెస్ మీట్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు.