డిసెంబర్ 12 న పెళ్లి పీటలెక్కి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో మూడు ముళ్ళు వేయించుకున్న మహానటి కీర్తి సురేష్ తాజాగా బేబీ జాన్ ప్రమోషన్స్ లో మునిగితేలుతోంది. పెళ్లి తర్వాత వెంటనే కీర్తి సురేష్ తన ప్రొఫెషన్ లో బిజీ అయ్యింది. బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంటుంది.
అయితే పెళ్ళైపోయింది కదా అని సాంప్రదాయ లుక్ లో కీర్తి సురేష్ కనిపించడం లేదు. పెళ్లి తర్వాత మెడలో తాళి బొట్టుతోనే మోడ్రెన్ అవతారమెత్తింది. తన సినిమాకి ఎలా ఉంటే ప్రమోషన్స్ కి పనికొస్తుందో అదే లుక్ ని ఫాలో అవుతుంది. తాజాగా డార్క్ బ్లూ శారీలో కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో కలిసి దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి.
ఆమె సోలో లుక్ చూసిన నెటిజెన్స్ కొత్త పెళ్లికూతురు కీర్తి సురేష్ గ్లామర్ వైబ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.