ఒకప్పుడు నాలుగు షిఫ్ట్ ల్లో పని చేసిన పూజ హెగ్డే గత రెండేళ్లలో ఒక్క సినిమా కూడా చెయ్యకుండా ఖాళీ అయ్యింది. వరస వైఫల్యాలు పూజ హెగ్డే కెరీర్ ని పాతాళంలోకి తోసేయ్యేడంతో అమ్మడు పనైపోయింది అనుకున్నారు అందరూ. నిజంగానే పూజ హెగ్డే ఈ రెండేళ్లలో వెకేషన్స్ లోనే కనిపించింది కానీ షూటింగ్ సెట్స్ లో కనిపించలేదు.
కానీ ఇప్పుడు పూజ హెగ్డే మరోసారి బిజీ అవుతోంది. అందులోను కోలీవుడ్‌లో పూజ హెగ్డేకి వరస ఆఫర్స్ రావడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. అక్కడ బీస్ట్ తో ప్లాప్ అందుకున్న పూజ హెగ్డే తాజాగా అదే విజయ్‌తో మరో సినిమా చేస్తుంది. తలపతి విజయ్ చేస్తున్న చివరి చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 లోను పూజ హెగ్డేనే హీరోయిన్.
లారెన్స్ కాంచన 4లో పూజ హెగ్దేనే హీరోయిన్ గా లాక్ అయ్యిందట. అతి త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. అంతేకాదు మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ సరసన కూడా పూజ హెగ్డేకి ఛాన్స్ వచ్చింది అంటున్నారు. ఇక బాలీవుడ్‌లోను షాహిద్ కపూర్ దేవా ఉండనే ఉంది, అలాగే వరుణ్ ధావన్ కామెడీ మూవీలోనూ పూజా హెగ్డే హీరోయిన్. ఈలెక్కన పూజకు పూర్వ వైభవం తిరిగొచ్చినట్టే కనిపిస్తుంది.