యాంకర్ అనసూయ కాదు కాదు యాక్టర్ అనసూయ అనాల్సిందే. కొంతకాలంగా మంచి మంచి కేరెక్టర్స్‌ని చూజ్ చేసుకుంటూ సిల్వర్ స్క్రీన్ మీద వెలిగిపోతున్న అనసూయ భరద్వాజ్.. వెండితెర మీద ఎన్ని సినిమాల షూటింగ్స్‌తో బిజీగా వున్నా తనని ఇంత బిజీగా ఉంచుతున్న సోషల్ మీడియాని మాత్రం పక్కనపెట్టదు.
ఎప్పటికప్పడు ఫ్రెష్ ఫొటోస్‌తో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ డిసెంబర్ వైబ్స్ అంటూ కిర్రాక్ ఫోటో షూట్‌ని షేర్ చేసింది. లైట్స్ మధ్యలో వెలిగిపోతూ, అలాగే డిన్నర్ చేస్తూ, అక్కడి క్లైమేట్‌ని ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ కుక్కపిల్లతో క్యూట్ గా ఆడుకుంటున్న ఫొటోస్‌ని అనసూయ షేర్ చేసింది.
మరి కంచి పట్టు చీర కట్టినా, చిట్టిపొట్టి డ్రెస్సు వేసినా అనసూయ మాత్రం చక్కగా బ్యూటిఫుల్‌గా గ్లామర్ చూపిస్తుంది. అయితే అనసూయకి ఏ సినిమా ఎలాంటి ఫీల్ ఇచ్చినా పుష్ప 2 చిత్రంలో దాక్షాయణి పాత్ర మాత్రం ఆమె అభిమానులని డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి. అందుకే ఆ సినిమా విడుదలయ్యాక అనసూయ ఎక్కడా తన పాత్ర గురించి కామెంట్స్ చేయలేదు.