Advertisement
Google Ads BL

అల్లు అర్జున్.. మనోళ్లు ఎవరో తెలిసొచ్చిందా


ఎవరు మనోళ్లు.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు చేయి అందించడం, మన కష్టాన్ని తన కష్టంగా భావించి దాని నుంచి గట్టెక్కించే వాళ్ళు మనోళ్లు, అంతకు మించి ప్రాణ మిత్రులు. ఇంకా చెప్పాలంటే బాధలో ఉన్నప్పుడు కనీసం ఓదార్పు, చిన్నపాటి పరామర్శ ఇవి చాలు.. ఇదిగో పలానా వాడు మనోడు, మిత్రుడని చెప్పుకోవడానికి ఈ మాత్రం చాలు. అంతే ఇంతకు మించి మణులు, మాణిక్యాలు, ఎవరూ ఆశించరు కూడా. బహుశా.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో మన, తన అనేది బాగానే తెలుసుకుని ఉంటారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

Advertisement
CJ Advs

ఇదీ అసలు సంగతి..

అల్లు అర్జున్.. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఇద్దరూ మంచి స్నేహితులు. ఇంకా చెప్పాలంటే ప్రాణ స్నేహితులు. ఒకరికోసం ఒకరు ఏం చేయడానికి అయినా సరే ముందుంటారు. ఇందుకు కారణం 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంత కుటుంబం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లి మద్దతు ఇచ్చి వచ్చారు. ఎప్పుడూ బాబాయ్ అని పిలుచుకునే పవన్ కోసం కేవలం ట్వీట్ మాత్రమే చేసి ఊరుకున్నాడు బన్నీ. ఇక్కడే మెగాభిమానులు, బన్నీ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలై చినికి చినికి గాలివానగా మారింది. ఇక అసలు విషయానికొస్తే అల్లు వారబ్బాయి అరెస్ట్ అయ్యాక గొడవలు ఉన్నాయా..? లేవా అన్న సంగతి పక్కనెడితే కష్ట కాలంలో అండగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఐతే అన్నీ తానై చూసుకున్నారు. ఐతే ఎక్కడా శిల్పా రవి కనిపించక పోవడం గమనార్హం.

ఇదేం ఫ్రెండ్ షిప్..?

అల్లు అర్జున్ అరెస్ట్ ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. బన్నీ ఇంటికెళ్ళి పరామర్శించడం, ధైర్యం చెప్పి, మద్దతుగా నిలవడం జరిగింది. ఆ తర్వాత మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబును కూడా స్వయంగా వారి ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు బన్నీ. రేపో మాపో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కలిసే యోచనలో అల్లు అర్జున్ ఉన్నట్టు మెగా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటి వరకూ రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది. ఇక్కడి వరకూ అంతా ఒకే కానీ ఆప్త మిత్రుడు శిల్పా వచ్చి కలిసినట్టు కానీ, కనీసం ఫోన్ చేసి మాట్లాడారని కానీ ఎలాంటి వార్తలు రాకపోవడంతో ఇదేనా స్నేహ బంధానికి అర్థం..? అంటూ బన్నీ అభిమానులు మండిపడుతున్నారు.

తీరిక లేదా..? 

హైదరాబాద్ నుంచి నంద్యాలకు, నంద్యాల నుంచి హైదరాబాద్ తిరగడానికి తీరిక ఉంటుంది కానీ, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కనీసం పలకరించి మాట్లాడటం లాంటివి అస్సలు లేవు. దీనికి తోడు పుష్ప 2 సినిమా చూడటానికి, పెళ్ళిళ్ళు, రిసిప్షన్లకు హాజరుకావడానికి మాత్రం సమయం ఉంటుంది కానీ.. మిత్రుడు జైలుకు వెళ్లి వస్తే కనీసం ఇంటికి వెళ్ళడానికి సమయం లేకపోవడం ఏంటి మిత్రమా..? అంటూ నంద్యాలకు వచ్చిన సందర్భాన్ని అభిమానులు గుర్తుకు తెచ్చుకుని ఒకింత ఫీల్ అవుతున్నారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇంత జరిగిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేసుకుని ఉండరా..? అనేది పెద్ద డౌట్. ఇందులో నిజానిజాలు ఎంత అనేది ఆ ఇద్దరికే తెలియాలి మరి.

 

 

 

 

Did Allu Arjun find out who True Friend is?:

<span style="background-color: #ffffff;">Allu Fans Reaction on Allu Arjun and Silpa Episode&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs