ఈమధ్యన త్రిష కృష్ణన్ స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ పట్టేస్తూ ఎంత క్రేజీగా కనిపిస్తుందో.. అటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో దొంగచాటుగా డేటింగ్ చేస్తుంది, విజయ్ తో కలిసి వెకేషన్స్ కి వెళ్లడమే కాదు, రీసెంట్ గా తమ పెళ్లి కోసమే స్పెషల్ గా పూజలు నిర్వహించింది అంటూ సోషల్ మీడియాలో ఏవేవో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిష కెరీర్ బ్యాక్ బౌన్స్ అయ్యిందా అన్న రీతిలో వరసగా బిగ్ బడ్జెట్ మూవీస్, క్రేజీ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలతో ఊపిరి ఆడడం లేదు. కోలీవుడ్ లో విజయ్, అజిత్, కమల్, తెలుగులో చిరు సినిమాలతో ఫుల్ బిజీగా వున్న త్రిష సోషల్ మీడియాలో వదిలే ట్రెడిషనల్ పిక్స్ మాత్రం తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
గ్లామర్ పక్కనపెట్టి మరీ ట్రెడిషనల్ శారీస్ లుక్స్ తో అద్దరగొట్టేస్తుంది. తాజాగా కాంజీవరం పట్టు చీరల ప్రమోషన్స్‌లో త్రిష చక్కటి కాంజీవరం పట్టు చీరలో దర్శనమిచ్చింది. అంతేకాదు ఫ్యాషన్ వస్తుంది, వెళుతుంది, కాంజీవరం మాత్రం శాశ్వతం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడామె ఈ చీరలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.