చాలామంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత హనీమూన్ అంటూ కాలయాపన చెయ్యకుండా ముందు ప్రొఫెషన్ తర్వాతే హనీమూన్ అంటున్నారు. గత ఏడాది కియారా అద్వానీ సిద్దార్ట్ మల్హోత్రాని వివాహం చేసుకుని రెండు రోజులకే పనిలో పడిపోయింది. ఈ ఏడాది రకుల్ ప్రీత్ కూడా పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్లకుండానే పనిలో బిజీ అయ్యిది. రీసెంట్ గా నాగ చైతన్య-శోభిత ల వివాహమయ్యింది. నాలుగు రోజులకే ముంబైలోని ఓ రిసెప్షన్ కి హాజరయ్యారు.
ఇక డిసెంబర్ 12 న గోవాలో ఆంటోనీతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు వేసిన కీర్తి సురేష్ పెళ్లి అయిన వారానికే ప్రొఫెషనల్ గా బిజీగా కనిపిస్తుంది. పెళ్లికి ముందు కూడా పెళ్లి వేడుకలంటూ మరీ టైమ్ వేస్ట్ చెయ్యకుండా చక్కగా పెళ్లి పీటలెక్కింది, పెళ్లి చేసుకుంది, తర్వాత రెండు రోజులకి ఆంటోనీని క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకుంది.
ఇప్పుడు హనీమూన్ కి వెళ్లకుండానే ప్రొఫెషనల్ గా తన పనిలో పడిపోయింది. మోడ్రెన్ గా మారిపోయినా మెడలో తాళిబొట్టుతో కొత్త పెళ్లికూతురులా కనిపించింది. కేవలం నల్లపూసలు మాత్రమే వేసుకుని కీర్తి సురేష్ బయటికి రాకుండా చక్కగా తాళి బొట్టుతో పద్దతిగా కనిపించింది.
అది చూసిన నెటిజెన్స్ కీర్తిసురేష్ కి హనీమూన్ కన్నా ప్రొఫెషనే ముఖ్యమైంది, మెడలో తాళి బొట్టు తో చక్కగా కనిపించింది, ముందు ప్రొఫెషన్ తరవాతే హనీమూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.